Virat Kohli: రూ.300 కోట్ల డీల్ తిరస్కరించిన విరాట్ 4 d ago

ప్రముఖ అప్పారెల్ బ్రాండ్ పూమాతో 8 సంవత్సరాల బంధానికి క్రికెటర్ విరాట్ కోహ్లి స్వస్తి పలికారు. ఆ కంపెనీ ఏకంగా రూ.300 కోట్లు ఆఫర్ చేసినా ఆయన తిరస్కరించినట్లు క్రీడావర్గాలు పేర్కొన్నాయి. 2017లో పూమాతో 8 సంవత్సరాలకు రూ.110 కోట్లతో ఆయన ఒప్పందం చేసుకున్నారు. దీనితో ఆ డీల్ ఇటీవల ముగిసింది. కాగా, ఇక పై తన సొంత బ్రాండ్ 'వన్ 8’ను ప్రమోట్ చేయాలన్న ఉద్దేశంతో విరాట్ ఆ సంస్థకు నో చెప్పినట్లు సమాచారం.